POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు AP: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో తన కూతురుపై అత్యాచారం జరిగినట్లు భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. By V.J Reddy 26 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి YCP Ex MLA Bhasker Reddy : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైసీపీ నేతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. ఈ క్రమంలో తన కూతురు గురించి అసత్య ప్రచారం చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Cr No 58 /2024 U/S 352,351(2),196(1),61(2),353(1),72(2) rw 3(5) BNS,67A ITA-2000-2008,23(1) POCSO ACT 2012,3(1)(z)(zc) SC ST కింద పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం! అసలేమైంది.. ఇటీవల తిరుపతిలో పదో తరగతి బాలికపై అత్యచారం జరిగిందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. తిరుపతికి సమీపంలోని ఎర్రావారిపాలెంలో పదవి తరగతి చదువుతున్న బాలిక స్కూలు ముగిశాక ఇంటికి చేరుకోలేదు. అయితే ఆందోళన చెందిన తల్లి దండ్రులు చుట్టూ గాలించారు. అయితే ఆ బాలిక రోడ్డు పక్కకు గాయాలతో పది ఉండటాన్ని తండ్రి గమనించారు. వెంటనే బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా తనపై అత్యాచారం జరిగిందని బాలిక తండ్రికి చెప్పింది. ఇద్దరు యువకులు వచ్చి తనను బలవంతం చేశారని తండ్రికి చెప్పగా.. ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే ఇదే అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేదని.. ఉదయం పూటనే ఓ బాలికపై అత్యాచారం జరగడం దారుణమని.. పోలీసులు, సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైల్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే.. పోలీసుల ట్విస్ట్.. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే కేసుపై ప్రభుత్వం, ప్రతిపక్షం నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలికపై పరీక్షలు చేసిన వైద్యులు బాలికపై అత్యచారం జరగలేదని తేల్చి చెప్పారు. ఇదే అంశాన్ని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఈ కేసు గురించి మాట్లాడవద్దని, బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి బాలికపై అత్యచారం జరిగిందని ప్రచారం చేయడంతో బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే.. Also Read: Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ #ap-ycp #chevireddy-bhaskar-reddy #pocso మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి