ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!

ఏపీలో పెన్షన్ దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఒకేసారి మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా కుటుంబ యజమాని మరణిస్తే.. మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

chandra babu,
New Update

ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పెన్షన్ దారులకు కొన్ని హామీలు ఇచ్చారు. పెన్షన్ నగదు పంపిణీపై వరాల జల్లు కురిపించారు. ఆయన పెన్షన్ దారులకు హామీ ఇచ్చినట్లుగానే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ నగదును పెంచుతానన్న హామీని నెరవేర్చారు.

Also Read: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు

ఇక ఇప్పుడు పెన్షన్ దారులకు ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పెన్షన్ దారుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే పెన్షన్ దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వరుసగా రెండు నెలల పెన్షన్‌ను ఏదైనా కారణాల వల్ల తీసుకోకపోతే మూడో నెలలో ముందు రెండు నెలల పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఈ రెండు నెలల పెన్షన్ మూడో నెలలో ఇవ్వండి బాబు అని చాలా మంది గగ్గోలు పెట్టారు. ఎంతో మంది తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

Also Read: హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్ వచ్చేస్తున్నాడు..

మూడు నెలల పెన్షన్‌ ఒకేసారి

దీనిపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వరుసగా మూడు నెలల పెన్షన్‌ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకోవచ్చని తెలిపింది. ఇకపై రెండు నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా.. మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది.

Also Read: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా

మరుసటి నెలలోనే వితంతు పెన్షన్

అంతేకాకుండా పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే.. వెంటనే మరుసటి నెలలోనే మృతిడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2024 నవంబర్ 21న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ

#ap #cm-chandra-babu #pensions #ap pensions news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe