/rtv/media/media_files/2025/02/10/FGXIW3jPMRxdxVGMiMts.jpg)
AP Deputy CM Pawan Kalyan
Chilkur Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఇది ఒక వ్యక్తిపై కాదని.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానన్నారు. దురదృష్టకరమైన ఘటన ఇదన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారన్నారు.
Also Read: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
నిజాలు నిగ్గు తేల్చాలి..
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరం
— JanaSena Party (@JanaSenaParty) February 10, 2025
•ఒక వ్యక్తిపై కాదు... ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలి
చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది.…
Also Read: Prashant Bhushan: ఆప్ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్.. కేజ్రీవాల్‌పై విమర్శలు
రామరాజ్యం(Ramarajyam) అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడిని తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ(Sanathana Dharma) పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారన్నారు. టెంపుల్ మూమెంట్(Temple Moment) అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారని గుర్తు చేశారు.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశి వారికి వాయిదా పడ్డ పనులన్నీ పూర్తై పోతాయి!
హిందూ ఆలయాల(Hindu Temples) నిర్వహణ, ధర్మ పరిరక్షణపై రంగరాజన్ ఎంతో తపన పడుతున్నారన్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతీ ఒక్కరం ఖండించాలని పిలుపునిచ్చారు. చిలుకూరు వెళ్ళి రంగరాజన్ ను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ(Janasena Party) తెలంగాణ విభాగానికి సూచించినట్లు చెప్పారు పవన్. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేశారు.