పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. నారా లోకేష్ షాకింగ్ ప్రకటన!

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. TTD ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్‌ డిమాండ్‌పై స్పందించారు. క్షమాపణ కోరడం పవన్‌ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.

New Update

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్‌ డిమాండ్‌పై రియాక్ట్ అయ్యారు. క్షమాపణ కోరడం పవన్‌ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో లోకేష్‌ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన మరుసటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. భక్తులకు క్షమాపణ చెప్పారు. టీటీడీ చైర్మన్, అధికారులు సైతం క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పారు. ఈ అంశంపై ఈ రోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ వర్ధంతికి హాజరైన లోకేష్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్ ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. లోకేష్ కామెంట్స్ పై టీటీడీ, జనసేనలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై జనసేన ఎలా స్పందిస్తుందనే అంశంపై స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తి నెలకొంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు