సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రి పై ఇటీవల పవన్ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వీరి సమావేశం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, పోలీసు రియాక్షన్ పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తానే హోం మంత్రి పదవి తీసుకోవలసి వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సీఎం చంద్రబాబు నాయుడు సమావేశపరచినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలో మార్పులు, సోషల్ మీడియాలో పోస్టులపైనే వీరి సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chandrababu: హోం మంత్రి అనితపై చంద్రబాబు సంచలన కామెంట్స్!
నిన్న కేబినెట్ భేటీలో సీరియస్..
నిన్న కేబినెట్ భేటీలో సోషల్‌మీడియాలో పోస్టులపై పవన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన పోలీసులు కీలక హోదాల్లో ఉన్నారని పవన్ మంత్రివర్గ సమావేశంలోనే వ్యాఖ్యానించారు. అయితే.. మంత్రులు చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ లా అండ్ ఆర్డర్ సెట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. తాజాగా పవన్, అనితలతో చంద్రబాబు సమావేశం కావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Biryani: బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెండ్
నేనే హోంమంత్రిని అయితే..
తానే హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉండేదని పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, గత ప్రభుత్వ తాలూకా సంస్కృతి ఇంకా కొనసాగుతోందని మండిపడ్డారు. శాంతి భద్రతలు కీలకమైనవని, అత్యాచార ఘటనలకు హోంమంత్రి బాధ్యత వహించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం సభలో శాంతిభద్రతలగురించి మాట్లాడిన ఆయన పోలీసు అధికారులు, ఎస్పీలకు పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: వైసీపీ సంచలన నిర్ణయం!
Also Read: వైసీపీ మాజీ మంత్రి అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్!