నిండా ముంచిన సువర్ణ భూమి.. లాభాల ఆశ చూపి రూ.200 కోట్లు స్వాహా! వెంచర్ల పేరుతో సువర్ణభూమి రియల్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. లాభాల ఆశ చూపి 200 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ.2 కోట్లు వసూల్ చేసి మొహం చాటేసింది. ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తి చెల్లని చెక్కులు ఇచ్చి నిలువునా ముంచారంటూ కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. By srinivas 20 Nov 2024 | నవీకరించబడింది పై 20 Nov 2024 10:15 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Suvarnabhoomi: వెంచర్ల పేరుతో సువర్ణ భూమి రియల్ సంస్థ వంచనకు పాల్పడింది. లాభాలు ఆశ చూపి పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది. మాయమాటలతో కోట్లు వసూలు చేసిన సువర్ణ భూమి మరికొందరికి టోకరా వేసింది. స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ.. భారీ ఎత్తున ప్రచారం చేసి ఘరానా మోసానికి పాల్పడింది. సినీ నటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేయించి భారీ స్థాయిలో వసూలు చేసిన సదరు సంస్థ.. బైబ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట 30 లక్షల నుంచి రెండు కోట్ల వరకు స్వాహా చేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తరువాత 24 శాతం లాభాలు ఇస్తామని ఆశ కల్పించి చివరికి చెల్లని చెక్కులు ఇచ్చి కస్టమర్లను నిలువునా ముంచింది. ఇది కూడా చదవండి: Dog యజమానులకు షాక్.. భారీ జరిమాన కట్టాల్సిందే..! చెల్లని చెక్కలు ఇచ్చి.. ఈ మేరకు సువర్ణభూమి ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు చూపించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు శ్రీకాంత్‌శర్మ, వేణుగోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, కల్పన ఆరోపించారు. గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో సువర్ణభూమిపై బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల నుంచి ముఖం చాటేసిన సువర్ణభూమి డైరెక్టర్లప చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. చెల్లని చెక్కలు ఇచ్చి, వారి కార్యాలయల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కనీసం తమకు అసలు వచ్చినా సంతోషిస్తామని బాధితులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అగ్రస్థానంలో హైదరాబాద్.. ఢిల్లీ, ముంబైని మించి ఆర్థికాభివృద్ధి! రిటైర్మెంట్ డబ్బులు స్వాహా.. ప్రముఖ సినీ హీరోలు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని వాపోతున్నారు. 200 మంది భాధితులు ఉన్నామని, రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మోసం జరిగిందని లబోదిబోమంటున్నారు. రూ.35లక్షల రిటైర్మెంట్ డబ్బులు సువర్ణభూమిలో ఇన్వెస్ట్ చేస్తే మోసం చేశారని రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయానని, సువర్ణభూమి ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నాదల్ వీడ్కోలు.. కన్నీరు పెట్టుకున్న ఫెదరర్.. పోస్ట్ వైరల్! ఇది కూడా చదవండి: ఓర్ని ఇదేం విచిత్రం.. చితి నుంచి లేచి నీళ్లు అడిగిన వృద్ధురాలు #Case on Suvarnabhoomi infra #suvarnabhoomi infra fraud #hyderabad #real-estate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి