TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు టీజీ టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. By Bhavana 20 Nov 2024 in తెలంగాణ జాబ్స్ New Update షేర్ చేయండి TG TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం,20వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ టెట్‌కు లక్షన్నరకుపైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. Also Read: AP Rains: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు! అయితే టెట్ గడువును మర రెండు, మూడు రోజులు పొడిగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్ధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం దరఖాస్తు స్వీకరణ గడువుపై ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు.కాగా, ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 2024 డిసెంబర్ 26న విడుదల చేయనున్నారు. Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు! ఈ పరీక్ష 2025 జనవరి 1నుంచి 20వరకు జరుగుతుంది. సెషన్ 1 ఉదయం 9గంటల నుంచి 11.30వరకు, సెషన్ 2 మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 5న టీఎస్ టెట్ ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా సగం మంది గ్రూప్ 3 పరీక్షలకు డుమ్మా గ్రూప్ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్-1కు 51.1 శాతం, పేపర్-2 కు 50.7 శాతం అలాగే సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 71.30 శాతం మంది హాజరయ్యారు. అత్యల్పంగా వరంగల్ జిల్లాలో 49.93 శాతం మంది హాజరయ్యారు. అయితే ఈ గ్రూప్ -3 నొటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read: Figs Fruits: ప్రధాని మోదీకి ఇష్టమైన పండు..ఇది తింటే రోగాలు పరార్ తెలంగాణ వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ సగం మంది అభ్యర్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. ఇదిలాఉండగా మొదటగా 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా జోడించడంతో వాటి సంఖ్య 1375కు పెరిగింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. దీనివల్ల మరోసారి 13 పోస్టులు అదనంగా కలిశాయి. మొత్తంగా గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య 1,388కి చేరింది. అయితే ఈ పరీక్షలకు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటే అందులో 50 శాతం మందే పరీక్షలు రాయడం గమనార్హం. #tg-tet-exam #last-date #teacher-posts #tg-tet-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి