AP Assumbly Sessions:
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Also Read: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మొదటి రోజే పూర్తిస్థాయి బడ్జెట్
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని అన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు పంట భీమా అందించలేదని అన్నారు.
Also Read: UK Diwali Celebrations: ప్రధాని దీపావళి విందులో మద్యం, మాంసం..!
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం అని తెలిపారు. వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తాం అని అన్నారు. పెట్టుబడి సాయం పెంచి, నెలరోజుల్లోనే అందించాం అని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అని పేర్కొన్నారు.
Also Read: యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారీ.. ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులు
విత్తనాలు, ఎరువులు రాయితీపై అందిస్తున్నాం. మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు, సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తాం అన్నారు. విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు కేటాయించామన్నారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.33 కోట్లు కేటాయించామన్నారు.