UK Diwali Celebrations: ప్రధాని దీపావళి విందులో మద్యం, మాంసం..!

అత్యంత పవిత్రంగా భావించే దీపావళి వేడుకలను యూకే ప్రధాని కార్యాలయం మద్యం, మాంసంతో నిర్వహించింది. దీంతో బ్రిటీష్‌ హిందూ వులతో పాటు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

New Update
diwali

UK: యూకే ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఏర్పాటు చేసిన దీపావళి విందులో మద్యం , మాంసం ఉన్నట్లు అక్కడ హిందువులు ఆరోపిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ నివాసం డౌనింగ్ స్ట్రీట్‌ 10లో దీపావళి వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని అధికారిక నివాసంలో దీపాలు వెలిగించి, మతాబులు కాల్చి, కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా చేశారు. ఈ వేడుకలకు హిందూ నేతలు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అతిథులకు మద్యం సరఫరా చేసి, మాంసం వడ్డించడంపై కొందరు బ్రిటిష్ హిందువులు మండిపడుతున్నారు.

Also Read:  Alert: హైదరాబాద్‌ వాసులు బి అలెర్ట్‌...ఈ ఏరియాల్లో వాటర్‌ బంద్‌!

మెనూలో బీరు, లాంబ్ కబాబ్స్, వైన్‌ కూడా ఉన్నట్టు అక్కడి మీడియా  కూడా నివేదించింది. గతేడాది రిషి సునాక్ ప్రధానిగా ఉన్నప్పుడు దీపావళి వేడుకలను నిర్వహించినా.. మద్యం, నాన్-వెజ్ వంటకాలను అతిథులకు వడ్డించలేదు. ఈ విషయం గురించి యూకేలోని ప్రముఖ హిందూ పండితుడు సతీశ్ కే శర్మ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కార్యాలయం కనీసం ఇంగితం లేకుండా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:  AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!

గత పద్నాలుగేళ్లుగా డౌనింగ్ స్ట్రీట్ 10లో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నా.. ఏనాడూ మద్యం, మాంసం పెట్టలేదన్నారు. ఇది తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘గత 14 ఏళ్లుగా యూకే ప్రధాని అధికారిక నివాసంలో మద్యం, మాంసం లేకుండానే దీపావళి వేడుకలు జరుగుతున్నాయి.. కానీ ఈ ఏడాది దీనికి విరుద్దంగా మద్యం, నాన్-వెజ్ సరఫరా చేయడం నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.. ప్రధాని సలహాదారులు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణం’ అని సతీశ్ శర్మ ఓ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకవేళ ఇది యాదృశ్చికంగా జరిగి ఉంటే అది ఇప్పటికీ నిరాశపరిచింది..ఉద్దేశపూర్వకంగా జరిగితే ప్రధాన మంత్రి స్టార్మర్.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ!

క్షమాపణలు చెప్పాలని...

బ్రిటిష్ హిందూ, భారతీయ ఐక్య వేదిక ఇన్‌సైట్ యూకే తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. ఎతో పవిత్రమైన దీపావళి వేడుకలను మద్యం, మాంసంతో జరిపి మతపరమైన మనోభావాలపై దెబ్బకొట్టారని తెలిపింది. దీనిపై డౌనింగ్ స్ట్రీట్ అధికారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మెనూ ఎంపిక దీపావళికి సంబంధించిన మతపరమైన సంప్రదాయాల పట్ల అవగాహన లేక గౌరవం లేకపోవడాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్‌ల విషయంలో మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలని కోరింది. కాగా, దీనిపై యూకే ప్రధాని కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది.

Also Read:  జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఆర్మీ జవాను మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు