/rtv/media/media_files/2025/05/19/zny6DM3a8xtYp6Brv4MZ.jpg)
Tirumala Tirupati Devasthanams
TTD : తిరుమల తిరుపతి దేశస్థానంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పాలకమండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సీరియస్ అయ్యారు. టీటీడీని తమ ధనార్జన క్షేత్రంగా మార్చుకొని స్వామివారి ఖజానాకు తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. తిరుమల ఆలయంలోని తులాభారం నగదును అక్కడి సిబ్బంది దొంగిలించారని ఆరోపించారు. కాగా ఈ విషయాలన్నింటిపై విచారణ జరపాలని కోరుతూ విజిలెన్స్ ఉస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కేవలం తను ఆరోపణలు మాత్రమే చేయడం లేదని తనవద్ద ఉన్న ఆధారాలను ఎస్పీకి అందజేసినట్లు చెప్పారు. 019 నుంచి 2024 వరకు విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
పరకామణి దొంగతనం, కల్తీ నెయ్యి వ్యవహారంతోపాటు తాజాగా తులాభారంలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగిలించిన అంశాలపై దర్యాప్తు చేయాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. దీనిపై జగన్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులను కూడా విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తులాభారంలో కానుకలను దొంగిలించిన అక్రమాలను అప్పటి విజిలెన్స్ అధికారులు బయటపెట్టినప్పటికీ.. నాటి ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
తులాభారం సమయంలో భక్తులు సమర్పించిన కానుకలను సగం లెక్క చూపి.. సగం దొంగతనంగా తీసుకెళ్లినట్లు ఆయన ఆరోపించారు.దీనిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన వివరించారు. పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగిని పట్టుకున్నప్పటికీ ఏదో చిన్న పంచాయతీ చేసినట్లు చేసి వదిలేశారన్నారు. ఇక తులాభారంలో జరిగిన దొంగతనాలకు కూడా అలాగే విడిచిపెట్టారని ఆరోపించారు. ఈ దొంగతనాలను చూస్తుంటే శ్రీవారి నగలు ఎన్ని చోరీకి గురయ్యాయో అన్న అనుమానం కలుగుతుందని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
Also Read: ఇండియా పాక్ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు