BIG BREAKING: ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ కూటమికి జగన్ సపోర్ట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు.

New Update
Chandrababu Pawan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని ఈ రోజు ఉదయం జగన్‌కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ ఫోన్ చేశారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని NDA విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 

పార్టీ పెట్టిన నాటి నుంచి వైసీపీ ఇటు ఎన్డీఏలోనూ.. ప్రతిపక్ష కూటమిలోనూ లేదు. అయితే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో అధికార పార్టీలకు సపోర్ట్ చేస్తూ వస్తోంది. జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని పెట్టిన సమయంలోనూ రాష్ట్ర పతి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వైసీపీ మద్దతు తెలిపారు. ఆ తర్వాత రామ్ నాథ్ కోవింద్, ద్రౌవది ముర్ము విషయంలోనూ అధికార బీజేపీకి సపోర్ట్ చేసింది వైసీపీ. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ ఇదే వైఖరి అవలంభించింది. రాజ్యంగ బద్ధ పదవులకు ఎన్నిక ఉండొద్దన్నది తమ పాలసీ అని చెప్పుకొచ్చింది.

అయితే.. గత పదేళ్లలో బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా.. ఆ పార్టీకి వైసీపీ సన్నిహితంగా ఉంటూ వస్తోంది. రెండు పార్టీల మధ్య నాటి ఎంపీ విజయసాయిరెడ్డి సమన్వయం చేశారన్న ప్రచారం కూడా ఉంది. అయితే.. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీని వీడారు. మరో కీలక ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నారు.  మరో వైపు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారిందిజ. జనసేన అధినేత పవన్ సైతం కూటమిలో పవర్ ఫుల్ నేతగా ఉన్నారు. ఈ ఇద్దరితోనూ వైసీపీ అధినేత జగన్ కు తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నాయి. దీంతో జగన్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ సారి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? లేరా? అన్న చర్చ జోరుగా సాగింది. అయితే.. జగన్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

మిథున్ రెడ్డి ఓటు వేస్తారా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ లో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియా కూటమి సైతం ఈ సారి అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి బలమైన అభ్యర్థి కోసం ఇండియా కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 21 నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ కాగా.. సెప్టెంబర్ 9న పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. 

Advertisment
తాజా కథనాలు