Earthquake: ఏపీలో మరోసారి భూకంపం.. భయంతో జనం పరుగులు!
ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో పరుగులు తీశారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి.. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.