ఏపీలో భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లను సులభరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేసుకునేందుకు లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా అనుమతిలిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. దీంతో 95 శాతం మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని సర్కార్ భావిస్తోంది. భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనుంది. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?
Construction Of Buildings
''ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన లైసెన్సుడ్ సర్వేయర్ల ద్వారా పర్మిషన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. సర్వేయర్లే ప్లాన్ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి డబ్బులు చెల్లించిన వెంటనే పర్మిషన్ ఇచ్చేలా ఏర్పాటు చేశాం. నిర్మాణం ప్రారంభించాక పునాదుల దశ ఫొటోలను సర్వేయర్లే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనుమతులకు విరుద్ధంగా ఎవరైనా పనులు చేపడితే సర్వేయర్ లైసెన్స్‌ను రద్దు చేస్తాం. క్రిమినల్ కేసులు కూడా పెడతాం.
Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!
రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయినవాళ్లు అదే ప్రాంతంలో అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ఇకనుంచి టీడీఆర్ బాండు అవసరం లేదు. స్థలం కోల్పోయినట్లు అధికారుల ధ్రువీకరణ ఆధారంగా పర్మిషన్ ఇస్తారు. వీళ్లు వేరే చోట చేపట్టే అదనపు అంతస్తుల నిర్మాణానికి టీడీఆర్ బాండు తప్పనిసరి. భవన అనుమతులకు సంబంధించి సింగిల్ విండో విధానం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తుంది.
Also Read: ఏక్‌నాథ్ షిండే సంచలనం.. సీఎం పోస్ట్ నుంచి ఔట్!
రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎయిర్‌పోర్ట్, అగ్నిమాపక, మైనింగ్, జనవనరులు, రైల్వేశాఖ నుంచి మున్సిపల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పర్మిషన్లు వచ్చేలా ఏర్పాటు చేశాం. 500 చదరపు అడుగులు దాచిన నివాస భవనాలకు సెల్లార్ పార్కింగ్ పర్మిషన్ ఇవ్వాలన్న ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. 120 మీటర్ల కంటె ఎత్తయిన భవనాల సెట్‌బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎత్తయిన భవనాల్లో పార్కింగ్ పోడియాన్ని 5 అంతస్తుల వరకు పర్మిషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 10 అంతస్తుల కంటే ఎత్తయిన భవనాల్లో రిక్రియేషన్ కోసం ఒక అంతస్తు ఉండేలా పర్మిషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలనూ కూడా ఆమోదించారు. ఇకనుంచి లేఅవుట్లలో 9 మీటర్ల వెడల్పులో రోడ్లు వదిలేలా వెసులుబాటు కల్పించామని'' మంత్రి తెలిపారు.