AP News : భక్తులకు అలర్ట్‌...ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత

విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు ముఖ్య సూచన. దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజులపాటు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు వారు వెల్లడించారు. దేవస్థానానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.

New Update
Ghat road closed

Ghat road closed

AP News : విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు ముఖ్య సూచన. దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజులపాటు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  ఈ నెల 6 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు వారు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడకుండా నివారించేందుకు మెష్‌ ఏర్పాటు ఇతర మరమ్మత్తులు చేయనున్న దృష్ట్యా ఘాట్ రోడ్డు మూసివేయాలని నిర్ణయించారు. భక్తులు కనకదుర్గ నగర్‌ మార్గం నుంచి దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలాగే , ఈ మూడు రోజులపాటు పార్కింగ్‌ ప్రదేశాల నుంచి దేవస్థానానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో విషాదం.. దామల చెరువులో వ్యాపారి దారుణ హత్య

 విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆంక్షలు విధించినట్లు దేవస్థానం అధికారులు ఓ ప్రకటన తెలిపారు. ఈ నెల 6, 7, 8న దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరమ్మతుల దృష్ట్యా ఘాట్‌రోడ్డు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు. పున్నమిఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

Also Read: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్

విశాఖ, చెన్నై పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలోని హోల్డింగ్ ఏరియాలో వాహనాలు పార్కు చేసుకుని, దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సులో కొండకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు భక్తులకు ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించామని దుర్గగుడి ఈవో తెలిపారు.

Also Read:రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Advertisment
తాజా కథనాలు