Aghori First Wife: ఇద్దరు పిల్లల తల్లిపై కన్నేసిన అఘోరి.. రాష్ట్రానికో అమ్మాయి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మొదటి భార్య!

అఘోరీ మొదటి భార్య రాధిక సంచలన విషయాలు తెలిపారు. ‘‘అఘోరీ మధ్యప్రదేశ్‌లో ఇద్దరి పిల్లల తల్లిపై మనసుపడింది. ఓ మహిళ తన బాధలు చెప్పుకోవడానికి వస్తే.. ఆమె చాలా అందంగా ఉందని నాతో చెప్పేది. అఘోరీకి రాష్ట్రానికో అమ్మాయి ఉంటుంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

New Update
Aghori First Wife Radha Shocking Comment

Aghori First Wife Radha Shocking Comment

అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నాను అని అఫీషియల్‌గా చెప్పినప్పటి నుంచి మరింత దుమారం రేగింది. అదే సమయంలో అఘోరీ మొదటి భార్యను నేనే అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం మరింత సంచలనంగా మారింది. అఘోరీ మోసగాడు. వాడు నన్ను ఇదివరకే పెళ్లి చేసుకున్నాడు. వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ మీడియాతో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌లో సైతం కంప్లైంట్ ఇచ్చింది. 

Also Read :  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

ఇందులో భాగంగా తాజాగా RTV ఛానెల్‌కు ఇచ్చిన లైవ్‌లో అఘోరీకి సంబంధించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. మొదట అఘోరీ తాను స్నేహంగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అఘోరీకి సంబంధించి అనేక విషయాలు తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మరెన్నో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

మధ్యప్రదేశ్‌లో ఇద్దరి పిల్లల తల్లి

‘‘మధ్యప్రదేశ్‌లో ఇద్దరి పిల్లల తల్లి తన భర్తతో ఎదురైన బాధలను చెప్పుకోవడానికి అఘోరీ వద్దకు వచ్చింది. ఆ మహిళ చెప్పిన బాధలు విని వెళ్లిపోయిన తర్వాత.. నాకు ఫోన్ చేసి.. ఆ మహిళ చాలా బాగుంది.. అందంగా ఉంది. ఆమెను కూడా నేను ఇష్టపడతానేమోనన్న భయం వేస్తుంది. 

ఒకవేళ ఎవరైనా వచ్చి తాళి కడతావా అంటే కూడా వెనక ముందు చూడకుండా కట్టేస్తాను అని అఘోరీ నాతో ఫోన్లో చెప్పింది. అప్పుడే నేను బాగా ఆలోచించాను. దీనిబట్టి చూస్తే అఘోరీకి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అమ్మాయి ఉండొచ్చు. ఎవరైనా తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చినపుడు.. వారిని బాగా అట్రాక్ట్ చేస్తది. అవసరం అయిపోయాక వాడుకొని వదిలేస్తది’’ అంటూ లైవ్‌లో సంచలన ఆరోపణలు చేసింది. 

(aghori sri varshini | Aghori First Wife | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు