Andhra Pradesh: ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్..

పవన్, చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ అర్జంట్‌గా అధికారంలోకి రావాలనే ఆత్రంలో ఉన్నారని విమర్శించారు. వీరి మైత్రి ఎంతకాలం ఉంటుందో వీరికే క్లారిటీ లేదని విమర్శించారు.

Andhra Pradesh: ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్..
New Update

Andhra Pradesh: చంద్రబాబుపై, పవన్‌లపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి. వీరిద్దరికీ అర్జంట్‌గా పవర్‌లోకి వచ్చేయాలనే ఆత్రం కనిపిస్తోందని విమర్శించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇద్దరు నేతలపై విరుచుకుపడ్డారు. 'మైత్రి చిరకాల ఉండాలని అంటున్నారు.. అంటే వారి పొత్తుపై వారికే నమ్మకం లేదు' అని సెటైర్లు వేశారు సజ్జల. 2 గంటల కోసం బ్రతిమాలుకుని పవన్‌ను యువగళం మీటింగ్‌కు తీసుకుని వచ్చారని వ్యాఖ్యానించారు.

వైసీపీ పేదల పక్షం అని ప్రజలకు తెలుసునని, సీఎం జగన్ చేస్తున్న ప్రతి చర్య పేదల పట్ల మమకారాన్ని చూపిస్తుందన్నారు సజ్జల రామకృష్ణ. రాష్ట్రంలో పేదలకు మంచి చేస్తుంటే.. అహంకారం అని పేరు పెట్టారని విపక్ష నేతల తీరును తూర్పారబట్టారు సజ్జల. 2014 నుంచి 2019 వరకు జరిగిన పాలన గురించి వీరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు సజ్జల. ఐదేళ్లు అవకాశం వచ్చినప్పుడు వారెందుకు ప్రజలకు మంచి చెయ్యలేదని చంద్రబాబును నిలదీశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కొత్త వాళ్ళలాగా కొత్త కొత్త హామీలు ఇస్తున్నారని, 2014 లో ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని ప్రశ్నించారాయన.

2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిందో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. 2019లో టిడిపితో పవన్ కు కమ్యునికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందన్నారు. ఇద్దరికీ కమ్యునికేషన్ గ్యాపా.. లేక ఏదైనా ఒప్పందంలో గ్యాపా అని ప్రశ్నించారు. పవన్‌కి ఎన్ని సీట్లు ఇస్తారో ఆయనకే తెలీదని, సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలీదని ఎద్దేవా చేశారు. అయినా.. జనసేన వేరే పార్టీ ఉండటం ఎందుకు? టీడీపీలో కలిపేయొచ్చుగా అని వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణ.

ఈ రెండు పార్టీలకు స్పష్టత లేదని, మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. 175 స్థానాల్లో పోటీకీ టీడీపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే లేరని అన్నారు. పొత్తులు, సీట్ల పంపిణీపై రెండు పార్టీలకు స్పష్టం లేదని, మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు సజ్జల. రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయడానికి టిడిపి, జనసేన పార్టీలకు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన నేతలు టచ్‌లో ఉన్నారని చెప్తున్నారని, వస్తే నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చని సూచించారు. తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని ధీమా వ్యక్తం చేసిన సజ్జల.. ఒకవేళ ఎవరైనా పక్క చూపులు చూస్తే నమస్కారం పెట్టి వెళ్లమని పంపిస్తామన్నారు.

Also Read:

ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు

ఇరిగేషన్ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ విషయాలు దాస్తే చర్యలు ఉంటాయని వార్నింగ్!

#chandrababu #tdp #pawan-kalyan #ysrcp-vs-tdp-janasena #janasena #cm-ys-jagan #sajjala-ramakrishna-reddy #andhra-pradesh-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe