Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్ మార్పు కేసులో (Inner Ring Road Case) అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ను ఛాలెంజ్ చేస్తూ ఆయన తరుపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద హైకోర్టులో రేపు విచారణ జరగవచ్చని తెలుస్తోంది. రాజధాని కేసులో A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు A1గా ఉన్న చంద్రబాబు,A2 మాజీ మంత్రి నారాయణ, A3 గా ఉన్న లింగమనేని రమేష్, A4 గా లింగమనేని రాజశేఖర్, A5 రామకృష్ణ హోసింగ్ డైరెక్టర్ అంజనీ కుమార్, A6 గా నారా లోకేష్ (Nara Lokesh) లు ఉన్నారు. మరోవైపు టీడీపీ (TDP) పాలన టైమ్ లో అయిన కుంభకోణాల మీద సీఐడీ (CID) సిట్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అందుకే బాబు తరుఫు న్యాయవాదులు వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారని సమాచారం.
ఇక చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ మీద ఈరోజు మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. నిన్న సాయంతరంవరకు ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈరోజు నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ జడ్జి చెప్పారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని, అదీకాక ఆయనకు 73 ఏళ్ళు కావున వయసు దృష్టిలో పెట్టుకుని ఆయనకు హౌస్ అరెస్ట్ కు అనుమతినివ్వాలని బాబు తరుపు లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా వాదించారు.
Also Read: ప్రిన్సిపల్ సెక్రటరీకి డీఐజీ లేఖ..చంద్రబాబును కలవాలంటే ఆయన అనుమతి తప్పనిసరి..!!