Ambati Rambabu: చంద్రబాబు దీక్షను చూసి గాంధీ ఆత్మ క్షోబిస్తోంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు.

Ambati Rambabu: చంద్రబాబుకి ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదు.. అందుకే నేను ముందే ఇలా చెప్పాను: అంబటి
New Update

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. పవన్‌ కళ్యాణ్‌ కాపులు ఉన్న చోటే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కాపుల ఓట్లను లాక్కునేందుకు చంద్రబాబు పవన్‌తో యాత్ర చేయిస్తున్నారన్నారు. అవనిగడ్డలో టీడీపీ, జనసేన కలిసి నిర్వహించిన సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో కలవడం వల్ల కాపులు జనసేన వారాహి యాత్రకు రాలేదన్నారు. పవన్‌ టీడీపీతో కలిసి తప్పు చేశారని, అందుకే కాపులు తిప్పి కొట్టారని అంబటి విమర్శించారు.

పవన్‌ కళ్యాణ్‌ ఏ పార్టీతో కలిసి పని చేస్తున్నాడో ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదని అంబటి రాంబాబు అన్నారు. జనసేన పార్టీ బీజేపీతో కలిసి పని చేస్తుందా లేక బీజేపీతో ఉన్న బందాన్ని కటీఫ్‌ చేసిందా అనేది అర్దం కావడం లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ అనైతికమైన వ్యక్తన్న అంబటి.. ఆయన బీజేపీ నేతల చెవిలో పెద్ద పువ్వులు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై జనసేన కార్యకర్తలను జనసైనికులు అనే బదులు సైకిల్‌ సైనికులు అంటే బాగుంటుందని మంత్రి ఎద్దేవా చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ కోసమే టీడీపీకి సపోర్ట్‌ చేస్తున్నారన్న అంబటి రాంబాబు.. ప్యాకేజీ కోసం కాకపోతే ఆయన బీజేపీని వీడి టీడీపీతో ఎందుకు కలిసి పని చేస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు అవినీతితో సంపాధించిన డబ్బుతో జనసేన పార్టీ నడుస్తోందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ భూస్థాపితం అవుతున్న పార్టీని బతికించాలని తాపత్రేయ పడుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ ఓడిపోవడం ఖాయమని అంబటి జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌ ఊహా ప్రపంచంలో ఉన్నాడన్న అంబటి.. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పవన్‌ ఊహా ప్రపంచం వచ్చే ఎన్నికల వరకే పని చేస్తుందన్న అంబటి ఎన్నికల అనంతరం మళ్లీ సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.

#pawan-kalyan #ycp #tdp #chandrababu #janasena #ambati-rambabu #deeksha #package
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe