Movies : అల్లు అయాన్ నోట డంకీ పాట..క్యూట్ రిప్లై ఇచ్చిన షారూఖ్

అల్లు అర్జున్ తన పిల్లలను వీడియోలను సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్‌గా పెడుతుంటారు. ఇలా అల్లు అయాన్ పాడిన డంకీ పాటను అర్జున్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇది షారూఖ్‌ ఖాన్‌ వరకూ వెళ్ళింది. దాంలో అల్లు అయాన్ మీద ప్రేమను కురిపించాడు షారూఖ్.

New Update
Movies : అల్లు అయాన్ నోట డంకీ పాట..క్యూట్ రిప్లై ఇచ్చిన షారూఖ్

Allu Ayaan Singing Lutt Putt Gaya Song : అల్లు అయాన్(Allu Ayaan) పాటకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) రియాక్ట్ అయి తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఆ పోస్టు అయాన్ పాడిన పాట సోషల్ మీడియా(Social Media) లో బాగా వైరల్ గా మారింది. అల్లు అర్జున సోషల్ మీడియా(Social Media) లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన భార్య కూడా బాగా యాక్టివ్‌గానే ఉంటారు. ముఖ్యంగా తమ పిల్లల వీడియోలు, ముద్దు మాటలు, అల్లరి లాంటి వీడియోలను బాగా పెడుతుంటారు ఈ జంట. ఈ క్రమంలో అల్లు అర్జున్(Allu Arjun) తన కొడుకు అయాన్ కారులో వెళుతున్నప్పుడు సరదాగా పాడిన ఓ పాటను పోస్ట్ చేశారు. ఇది షారూఖ్ సినిమా డంకీలోని లుట్ పుట్ గయా అన్న పాట. దీన్ని అల్లు అర్జున్ సోసల్ మీడియాలో పెట్టి షారూఖ్‌ ఖాన్‌ను కూడా ట్యాగ్ చేశారు.

షారూఖ్‌ క్యూట్ రిప్లై..

అల్లు అయాన్ పాడిని పాటకు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ ఖాన్ రిప్లై ఇచ్చారు. థాంక్యూ లిటిల్ వన్...పాట బాగా పాడావు. నీ పాటలో ఫ్లవరూ, ఫైరూ రెండూ చూపించావని రాశారు. దీంతో పాటూ నేను కూడా నా పిల్లలకు పుష్ప సినిమాలో శ్రీవల్లీ పాట నేర్పిస్తా అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు షారూఖ్ పెట్టిన ఈ పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. దాంతో పాటూ అల్లు అయాన్ పాట కూడా ట్రెండింగ్ అవుతోంది. దీనికి అల్లు అర్జున్‌ కూడా రిప్లై ఇచ్చారు. షారుఖ్ జీ సో స్వీట్ ఆఫ్ యూ.. మీ హంబుల్ మెసేజ్ కి ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చాడు.

Also Read : Aha : ‘మిక్సప్ ఆన్’..సెమీ పోర్న్ మూవీ పరిచయం చేయబోతున్న అల్లు ఫ్యామిలీ!

Also Read : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక

Advertisment
తాజా కథనాలు