Aha : ‘మిక్సప్ ఆన్’..సెమీ పోర్న్ మూవీ పరిచయం చేయబోతున్న అల్లు ఫ్యామిలీ! కమల్ కామరాజు, ఆదర్శ్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ‘మిక్సప్ ఆన్’టీజర్ జనాలకు పిచ్చెక్కిస్తోంది. ఓవర్ డోస్ బోల్డ్ సీన్స్, డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటి పెంచేశాయి. సెమీ పోర్న్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆహా' వేదికగా మార్చి 15న విడుదలకానుంది. By srinivas 26 Feb 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి MiXup : ఓటీటీ(OTT) పుణ్యమా అని జనాలకు బోల్డ్ కంటెంట్(Bold Content) కు కొదవలేకుండా పోతుంది. ఈ వేదికగా విడుదలవుతున్న సినిమా, సిరీస్ లకు సెన్సార్ కట్ లేకపోవడంతో శృంగార సన్నివేశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. అంతేకాదు జనాల అభిరుచులకు తగ్గట్లుగా సన్నిహిత సన్నివేశాలను తీర్చి దిద్దుతున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభించడంతో మరింత డోస్ పెంచేస్తున్నారు. ఇంతకాలం ఇంగ్లీష్ చిత్రాల్లోనే(English Movies) ఎక్కువగా కనిపించే సెమీ న్యూడ్ సీన్స్(Semi Nude Scenes) ఇప్పుడు అన్ని భాషల్లోనూ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు దర్శకనిర్మాతలు పెట్టుబడికి డబల్ ఇన్ కమ్ రాబట్టేందుకు అసలే వెనకాడట్లేదు. ఇందులో భాగంగానే ఆహా వేదికగా త్వరలో రాబోతున్న ‘మిక్సప్ ఆన్’ టీజర్ రిలీజ్ చేసి జనాలకు షాక్ ఇచ్చారు మేకర్స్. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడాలంటూ.. ఈ మేరకు కమల్ కామరాజు, ఆదర్శ్, అక్షర గౌడ, పూజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిక్సప్ ఆన్’(MiXup) మార్చి 15న ఆహా(Aha) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రమోషన్ లో భాగంగా టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కొత్తగా పెళ్లైన వారిని టార్గెట్ చేస్తూ మొదలవగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడాలని ముందుగానే సూచించారు. ఇది కూడా చదవండి : Gyanvapi: జ్ఞానవాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు! సెక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. టీజర్ విషయానికొస్తే.. కమల్ కామరాజు బెడ్ మీద పడుకుని ఉంటే అతని భార్య కొరడాతో కొడుతూ తన కామ వాంఛను తీర్చుకుంటుంది. 'నాకు మూడు రావాలంటే ఎగ్జయిట్ మెంట్ కావాలి. ఎంటర్టైన్ మెంట్ కావాలి' అంటూ అతనిపై పడి రెచ్చిపోతుంది. ఇక తర్వాత ఆదర్శ్ జంట బెడ్ పై రొమాన్స్ చేస్తుండగా.. 'సెక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు' అంటూ ఆదర్శ్ తన భార్యకు పిచ్చెక్కిస్తాడు. కానీ ఆమెకు పెద్దగా ఇష్టం ఉండదు. 'నేను నీ మొగుడిని నాకు ఇష్టం ఉన్నప్పుడు ముట్టుకునే హక్కు నాకు ఉంటుంది' అని చెబుతాడు. ఇందులో రెండు జంటల్లో ఒకరికి శృంగారంపై ఇష్టం ఉంటే మరొకరికి పెద్దగా నచ్చదు. 'రోజు ఒకే పార్ట్ నర్ తో చేస్తే బోర్ కొట్టదా? అనే డైలాగ్ మరీ దారుణంగా ఉంది. ఇక చివరలో 'పెళ్లాన్ని సుఖ పెట్టనివారు అందరూ అలాగే అంటారు' అంటూ కమల్ భార్య చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. సెమీ పోర్న్.. అయితే ఈ రెండు జంటల మధ్య ఏం జరిగింది? వీరి నలుగురి పరిచయాలు ఎక్కడికి దారితీశాయి? అనేది తెలియాలంటే మార్చి 15 వరకూ వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతుండగా నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. నటీనటుల డ్రెస్సింగ్, కిస్సింగ్, రొమాన్స్ పై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా 'ఆహా'(Aha) వేదికగా సెమీ పోర్న్ సినిమా తీసుకొస్తున్నారంటూ అల్లు ఫ్యామిలీ(Allu Family) ని జనాలు తిట్టిపోస్తున్నారు. #kamal #love-or-lust-adarsh #mixup #aha #teaser మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి