Rashmika : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక రష్మిక రీసెంట్ గా నటించిన సినిమా యానిమల్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్ సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక రాసుకొచ్చింది. By Bhavana 26 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tollywood : ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్(Bollywood) లో కూడా ఫుల్ బిజీగా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక(Rashmika). ఇటీవల బాలీవుడ్(Bollywood) లో యానిమల్(Animal) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ సినిమా విజయం సాధించిన ఆనందాన్ని మాత్రం రష్మిక ఆస్వాదించలేకపోతుందంట.ఎందుకంటే తాను తీరిక లేకుండా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్లే అంట. రష్మిక ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2) ది రూల్, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్, చావా అనే సినిమాలను చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఆమె షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. రష్మిక రీసెంట్ గా నటించిన సినిమా యానిమల్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. కానీ రష్మిక మాత్రం ఆ సక్సెస్ మీట్స్ లో పాల్గొనడం లేదు. దీంతో ఆమె విచారాన్ని వ్యక్తం చేసింది. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్(Animal) సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా(Social Media) ఖాతాలో రాసుకొచ్చింది. ఇటీవల రష్మిక తన ముఖం కనిపించకుండా ఫోన్ అడ్డుగా పెట్టుకుని ఓ చిత్రాన్ని విడుదల చేసింది. దాని కింది '' మీరంతా నన్ను చాలా మిస్ అవుతున్నారని నాకు తెలుసు. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. కానీ నా కొత్త సినిమాకు సంబంధించిన లుక్ ను చిత్ర బృందం విడుదల చేయోద్దని తెలిపింది. అందుకే నేను ముఖం చూపించడం లేదు. ప్రస్తుతం నేను ఫుల్ బిజీగా ఉన్నాను. కాబట్టి ఇంకా కొంత కాలం ఓపిక పట్టండి. అందుకే నేను యానిమల్ సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నేను కూడా ఆ చిత్ర బృందంతో కలిసి ఆనందంగా గడపాలని ఉంది. కానీ కొత్త సినిమా షూటింగ్ ల కోసం ఆ సక్సెస్ కు దూరంగా ఉంటున్నాను. అందుకే ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో కనిపిండం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుందని ఆమె పేర్కొంది. Also Read : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు! #animal #tollywood #rashmika #animal-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి