Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం

బంగ్లాదేశ్ పరిస్థితుల మీద అఖిల పక్షం సమవేశం జరిగింది. ఈ విషయంలో అలర్ట్‌గా ఉన్నామని ఈ సమాశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులను నిత్యం పరిశీలిస్తున్నామని..ప్రజల భద్రత విషయమై ఆర్మీతో టచ్ లో ఉన్నామని చెప్పారు.

New Update
Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం

All Party Conference:బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్.. పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. భారతీయలను తరలించేంతగా బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు ప్రమాదకరంగా లేవు. కానీ అక్కడి పరిస్థితుల్ని అత్యంత అప్రమత్తతతో గమనిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో 12-13 వేల మంది భారతీయులున్నారు. పొరుగుదేశంలో ఉన్న మన ప్రజల భద్రత విషయమై అక్కడి ఆర్మీతో టచ్‌లో ఉన్నాం అని మంత్రి జైశంకర్ వెల్లడించారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాతో భారత ప్రభుత్వం మాట్లాడిందన్నారు. మానవత్వ చర్యలో భాగంగానే ఆమెకు భారత్‌లో ఆశ్రయం ఇచ్చామని చెప్పారు. భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం కావాలని భావిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. షేక్ హసీనాను గద్దె దింపడం వెనక విదేశీ కుట్ర ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని జైశంకర్ బదులిచ్చారు. అయితే, పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనలకు మద్దతుగా తన ప్రొఫైల్‌ పిక్‌ను మార్చుకున్నారు అని సమాధానం ఇచ్చారు.

ఇదిలాఉంటే.. హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలివెళ్లిపోవడం వెనక అమెరికా హస్తం ఉందనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్మగర్భంగా సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణమనే భావిస్తున్నారు.

Also Read: Telangana: హైదరాబాద్ కు మరో పెట్టుబడి..ట్రైజిన్ ఏఐ సెంటర్

Advertisment
తాజా కథనాలు