Triazine Technologies: ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ సెంటర్ పై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను ఇవ్వనుంది.
పూర్తిగా చదవండి..Telangana: హైదరాబాద్ కు మరో పెట్టుబడి..ట్రైజిన్ ఏఐ సెంటర్
హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ట్రైజిన్ సంస్థ హైదరాబాదలో ఏఐ సెంటర్ నెలకొల్పనుంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులను అమెరికాలో కలిశారు.
Translate this News: