Covid Vaccine : కోవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield) తీసుకున్నవారిలో చాలా అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్(Side Effects) వస్తాయని ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సైడ్ ఎఫెక్ట్స్‌కు గురవుతున్నారని తేలింది. ఇటీవల బనారస్ హిందూ యూనివర్సిటీ.. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై పరిశోధన చేసింది. ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. టీనేజర్లలో 47.9 శాతం మంది, పెద్దల్లో 42.6 శాతం మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్లు ఈ అధ్యయనం పేర్కొంది. టీకా తీసుకున్న ఏడాదిలోపు ఎడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్‌కు గురైనట్లు తెలిపింది.
Also read: ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా?
అయితే నిపుణుల ప్రకారం.. ఏఈఎస్‌ఐ(AESI) అనేది ప్రతికూల ఘటనల సమాహారం. దీనివల్ల అనాలిలాక్సిస్, మయోకార్డిటిస్, త్రోంబోసిస్ (రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం) వంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో స్ట్రోక్, గులియన్-బారే సిండ్రోమ్ వంటివి కూడా స్వల్పంగా ఉంటాయని తెలిపారు. అలాగే మహిళల్లో రుతుక్రమం కూడా గతి తప్పే అవకాశం ఉందని.. ఇలాంటి సమస్యలు ఉన్నావారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇదిలాఉండగా.. తమ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే కారణంతో ఇటీవల ఆస్ట్రాజెనికా కంపెనీ ఉత్పత్తిని ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే కొవాక్సిన్(Covaxin) ను భారత్‌కు చెందిన భారత్ బయోటెక్(India Biotech) అనే సంస్థ అభివృద్ధి చేసింది. కొవాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై ఈ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also read: అయోధ్యలోని రామమందిరంపై బుల్‌డోజర్‌లను నడుపుతారు.. మోదీ విమర్శలు