పార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా

సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

New Update
పార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా

హీరోయిన్ తమన్నా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.ఈరోజు మధ్యాహ్నం భవనానికి రావడంతో పాటూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి బిల్లుదోహదపడుతుందని తమన్నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక తమన్నాతో పాటూ నటి దివ్యా దత్త కూడా ఈరోజు నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమన్నారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు బాగుందని కొనియాడారు.

వీరిద్దరే కాక బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, బీజెపీ నేత, నటి కుష్బూ, మంచులక్ష్మి కూడా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టిన వేళ సాక్ష్యంగా ఉన్న ఘనత తనకు దక్కుతుందని నటి ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సాక్ష్యంగా తమను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఖుష్బూ ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటూ క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా సందర్శించిన వారిలో ఉన్నారు.

ఇక రాజ్యసభ వైస్ ఛైర్ పర్శన్, అథ్లెట్ పీటీ ఉష కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద స్పందించారు. మహిళలకు ఇది అమృత కాలమని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యసభ వైస్ ఛైర్ పర్శన్ గా బిల్లును గౌరవంగా భావిస్తున్నాని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు