Rakhi Fest : ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ?

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్‌ చంపా జిల్లాలో బహెరాడి అనే గ్రామంలో ఏటా రెండు రోజులు రక్షా బంధన్ జరుపుకుంటారు. పండుగకు ఒకరోజు ముందే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లకు, మొక్కలకు అక్కడి ప్రజలు రాఖీలు కడతారు. ఆ తర్వాత రోజున మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు.

New Update
Rakhi Fest : ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ?

A Village Celebrates 2 Days Raksha Bandhan : దేశంలో ఆగస్టు 19న సోమవారం రక్షా బంధన్‌ పండగ జరగనున్న సంగతి తెలిసిందే. బయట ఎక్కడా చూసినా రాఖీ (Rakhi) దుకాణాలే కనిపిస్తున్నాయి. అక్కా చెల్లిళ్లు, తమ అన్నాదమ్ముల్ల కోసం రాఖీలు కొనేందుకు షాపుల వద్ద బారులు తీరారు. పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి చేరుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సందడి వాతావరణం నెలకొంది. సాధారణంగా ఈ పండుగ ఒక రోజు మాత్రమే ఉంటుంది. కానీ ఓ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షా బంధాన్ (Raksha Bandhan) జరుపుకుంటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది ? రెండు రోజులు పండుగ జరుపుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Also read: బెంగళూరులో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ లైంగికదాడి

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని జంజ్‌గిర్‌ చంపా జిల్లాలో బహెరాడి అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది రక్షా బంధన్ రెండు రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ నివసించే రైతులు, మహిళలు, విద్యార్థులు రక్షా బంధన్ పండుగకు ఒకరోజు ముందే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ఆ రోజున జరిగే కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు ఇలా అందరూ పాల్గొంటారు. ఆ మరుసటి రోజు రక్షబంధాన్ రోజున ఆ గ్రామంలోని మహిళలు.. తమ సోదరులకు రాఖీలు కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తుంటారు.

publive-image

దీనదయాళ్ యాదవ్ అనే అక్కడి స్థానికుడు మీడియాతో మాట్లాడాడు. ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారు చేస్తారని చెప్పాడు. అలాగే వీటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తామని తెలిపాడు. అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లాల కలెక్టర్లకు కూడా ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తామని పేర్కొన్నాడు.

Advertisment
తాజా కథనాలు