Crime News : హాస్టల్‌లో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

మలక్‌పేట పీఎస్‌ పరిధిలోని వరంగల్‌కు చెందిన యాకయ్య(19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న యాకయ్య శుక్రవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Hostel : హైదరాబాద్‌(Hyderabad) లోని మలక్‌పేట పీఎస్‌ పరిధిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య(Suicide) కు పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా(Warangal District) కు చెందిన యాకయ్య(19) సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతూ.. మలక్‌పేటలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే శుక్రవారం కాలేజీకి వెళ్లొచ్చిన యాకయ్య సాయంత్రం 6 గంటలకు తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తోటి విద్యార్థులు అతడిని చూసి షాకైపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టు కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Also Read: రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు: రేవంత్

యాకయ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కుమారుడి ఆత్మహత్యతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇవ్వాలని సోషలిస్టు విద్యార్థి సంఘం అధ్యక్షుడు నక్క వెంకటేశ్‌, మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. అలాగే విద్యార్థి ఆత్మహత్యపై విచారణ జరిపి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Also Read: దోస్త్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

Advertisment
తాజా కథనాలు