DOST : దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్! తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 6 నుంచి మే 25 వరకు ఈ ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. By Bhavana 04 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి DOST Notification : తెలంగాణ(Telangana) వ్యాప్తంగా డిగ్రీ కాలేజీ(Degree Colleges) ల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 6 నుంచి మే 25 వరకు ఈ ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. రూ. 200 రుసుంతో ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. మే 15 నుంచి మే 27 వరకు ‘దోస్త్’ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 3న ‘దోస్త్’ మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జూన్ 4 నుంచి 10 లోపు ‘దోస్త్’(DOST) సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు. జూన్ 4 నుంచి జూన్ 13 వరకు ‘దోస్త్’ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.రూ.400 రుసుంతో ‘దోస్త్’ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. జూన్ 4 నుంచి జూన్ 14 వరకు దోస్త్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. జూన్ 18న దోస్త్ రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ ను అధికారులు మొదలు పెడతారు. జూన్ 19 నుంచి 24 వరకు ‘దోస్త్’ సెల్ఫ్ రిపోర్ట్ కు అవకాశం కల్పించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జూన్ 19 నుంచి జూన్ 25 వరకు ‘దోస్త్’ మూడో దశ రిజిస్ట్రేషన్ ను చేపట్టనున్నారు. రూ. 400 రుసుంతో ‘దోస్త్’ మూడో దశ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. జూన్ 19 నుంచి 25 వరకు దోస్త్ మూడో దశ వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. జూన్ 29న దోస్త్ మూడో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు చేపడతారు. Also read: పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత! #telangana #degree-colleges #notification #dost మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి