Floods: భారీ వరదలు.. 33 మంది మృతి

అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు.

New Update
Floods: భారీ వరదలు.. 33 మంది మృతి

భారీ వర్షాలతో అఫ్గానిస్తాన్ అతలాకుతలం అయిపోయింది. వరదల వల్ల ఏకంగా 33 మంది చనిపోయారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అఫ్గానిస్తాన్ రాజధాని అయిన కాబూల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. తమ దేశంలో వచ్చిన వరదలకు సంబంధించి తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల దేశంలో.. 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. భారీ వర్షాలకు 200 పశువులు మృతి చెందాయని.. 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

Also Read: లోక్‌సభ ఎన్నికలు.. నిత్యం పట్టుబడుతున్న రూ.100 కోట్లు

అలాగే 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పశ్చిమ ఫరా, సదరన్ జాబుల్, కాందహార్, హెరాత్‌లకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెప్పారు. మరోవిషయం ఏంటంటే.. రానున్న రోజుల్లో అఫ్గానిస్థాన్‌లోని 34 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలాఉండగా.. అఫ్గానిస్తాన్‌లో గత నెల ఫిబ్రవరిలో భారీ హిమపాతం వల్ల కొండచరియలు విరిగిపడి మొత్తం 25 మంది మృతి చెందడం కలకలం రేపింది.

ఇక మార్చిలో కురిసిన భారీ వర్షాలకు 60 మంది మరణించారు. అఫ్గానిస్తాన్‌లోని వాతావరణ పరిస్థితుల్లో అనేకు మార్పులు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాదే హెచ్చరికలు జారీ చేసింది. గ్లోబల్ వార్మింగ్ దీనికి కారణమని వెల్లడించింది. ఇప్పటికే గ్రీన్ హౌస్ వాయుల వల్ల కారణమవుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: వరుసగా పార్టీలు పెడుతున్న హీరోలు…విజయ్ తర్వాత విశాల్..

Advertisment
తాజా కథనాలు