Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండ్‌ కు లక్ష్యసేన్

పారిస్ ఒలింపిక్స్‌లో మనవాళ్ళ అడుగులు నెమ్మదిగా ముందుకు పడుతున్నాయి. నిన్న జరిగిన హాకీ పురుషుల మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ మీద గెలిచింది. దాంతో పాటూ బ్యాడ్మింటన్‌లో పురుషల సింగిల్స‌లో లక్ష్యసేన్ మొదటి రౌండ్ గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

New Update
Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండ్‌ కు లక్ష్యసేన్

Badminton single and doubles: పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. మెన్స్ సింగిల్స్​ గ్రూప్​ స్టేజ్​ మొదటి మ్యాచ్‌లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ లక్ష్యసేన్ గెలిచాడు. గ్వాటెమాల ష‌ట్ల‌ర్‌ కెవిన్ కోర్డాన్‌పై 21-08, 22-20 తేడాతో విజ‌యం సాధించిన షట్లర్ నెక్ట్ప్ రౌండ్‌కు ఆర్హ‌త సాధించాడు.

మ్యాచ్ మొదలైంది. మొదట సెట్‌లో లక్ష్యసేన్‌కు విజయం చాలా ఈజీగానే వచ్చేసింది. కానీ రెండో సెట్‌కు వచ్చేసరికి అవలి ఆటగాడు పట్టు బిగించాడు. దాంతో మ షట్లర్‌కు గట్టిపటీ ఎదురైంది. అయితే లక్ష్యసేన్ ఎక్కడా పట్టు విడవకుండా ఆడాడు. దీంతో రెండో సెట్ కూడా అతని సొంతం అయింది. జులై 29న గ్రూప్ స్టేజ్​లో రెండో మ్యాచ్​ ల‌క్ష్య‌సేన్ ఆడ‌నున్నాడు. ల‌క్ష్య‌సేన్‌కు ఇదే ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి.

ఇక మరోవైపు బ్యాడ్మింటన్ మెన్ డబుల్స్‌లో కూడా భారత్ బోణీ కొట్టింది. సాత్విక్-చిరాగ్ లు అద్భుతంగా ఆడి 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్ జంట లూకాస్ కార్వీ, రోనన్ లాబర్‌పై గెలుపునందుకున్నారు. వీళ్ళు కూడా జులై 29న గ్రూప్ స్టేజ్​లో రెండో మ్యాచ్​ సాత్విక్‌-చిరాగ్ ఆడ‌నున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు