/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CAR-2-jpg.webp)
అమెరికాలోని సౌత్ కరోనాలినాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్.. ఈ ముగ్గురు ఓ ఎస్‌యూవీ కారులో పరిమితికి మించి వేగంతో ప్రయాణించారు. దీంతో వాహనం అదుపుతప్పి 4 -5 పల్టీలు కొట్టింది. చివరికి ఓ చెట్ల పైకి ఎగిరిపడి.. అందులో ఇరుక్కుపోయింది.
Also Read: ‘రామాయణ’ సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్
కారు గాల్లోకి 20 అడుగుల ఎత్తు వరకు లేచినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం సమాచారం మేరకు అత్యవసర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందడంతో.. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల అమెరికాలో వరుసగా భారతీయులు మరణిస్తున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి.