Bhole Baba : తొక్కిసలాట ఘటనలో 116కు చేరుకున్న మృతుల సంఖ్య.. రేపు హత్రాస్‌కు సీఎం యోగీ

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిలసలాట కారణంగా మరణించినవారి సంఖ్య 116కు చేరింది. ఇక బుధవారం హత్రాస్‌కు యోగీ ఆదిత్యనాథ్ వెళ్లనున్నారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Bhole Baba : తొక్కిసలాట ఘటనలో 116కు చేరుకున్న మృతుల సంఖ్య.. రేపు హత్రాస్‌కు సీఎం యోగీ

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ (Hathras) లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిలసలాట కారణంగా మరణించినవారి సంఖ్య 116కు చేరింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah).. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath) కు ఫోన్ చేసి మాట్లాడారు. తొక్కిసలాటలో పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్రం సహాయ సహకారాలు అందుస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. అలాగే ఎక్స్‌లో కూడా మరణించిన వారికి సంతాపం తెలిపారు.

ఇక బుధవారం హత్రాస్‌కు యోగీ ఆదిత్యనాథ్ వెళ్లనున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన ఎప్పటిక్కప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. అలాగే ఈ ఘటనపై విచారించేందుకు ఇప్పటికే సీఎం యోగీ.. ఏడీజీ ఆగ్రా, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. 24 గంటల్లో నివేదిక అందించాలని..అలాగే ఈ ఘటనకు కారకులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఇదిలాఉండగా.. యూపీలోని హత్రాస్ జిల్లా సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో భోలే బాబా సత్సంగ్‌ పేరుతో ఆధ్యా్త్మిక కార్యక్రమాన్ని నిర్వహించగా.. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు సైతం భక్తులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 116 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.

అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మాత్రమే కాక ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు.అయితే మంగళవారం.. ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు.. పాక్ నుంచి ప్రత్యేక గన్!

Advertisment
తాజా కథనాలు