Road Accident in Pune: పూణెలోని దిగవాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించినవారిని సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణ ఖేడ్ వాసులని పోలీసులు వెల్లడించారు. మృతులు మహబూబ్ ఖురేషి, ఫిరోజ్ ఖురేషి, రఫిక్ ఖురేషి, ఫిరోజ్ ఖురోషి, మజీద్ పటేల్‌గా గుర్తించారు. వీళ్లందరు 25 ఏళ్ల లోపే వారని తెలిపారు. సయ్యద్ అమర్‌కు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. అజ్మీరా దర్గాకు వెళ్లివస్తుండగా.. వేగంగా వస్తున్న ఆ కారు రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ పిట్లో పడిపోయినట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పూణెలోని దిగవాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ వాసులుగా గుర్తించారు.
Translate this News: