Lok Sabha Elections: నాగలాండ్‌లోని ఆ ప్రాంతంలో సున్నా శాతం ఓటింగ్.. కారణం ?

ఏప్రిల్‌ 19న జరిగిన మొదటిదశ ఎన్నికలు జరగగా.. నాగలాండ్‌లోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కు వినయోగించుకోలేదు. తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలనే బంద్‌ పిలుపు మేరకు ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Elections : నేడు దేశంలో ఐదో దశ పోలింగ్‌.. ఈ సారి కూడా పోటీలో ప్రముఖులు!
New Update

లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఏప్రిల్ 19న నిర్వహించిన మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే నాగలాండ్‌లో మాత్రం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇందుకు కారణం తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ రావడమే. 'ఈస్టర్న్ నాగ్‌లాండ్ పీపుల్స్‌ సంస్థ'(ENPO) ఈ ఆరు జిల్లాలు ఉన్న ప్రాంతాన్ని 'ఫ్రాంటీర్ నాగలాండ్ టెర్రిటరీ(FNT)గా ప్రకటించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న ఎన్నికల వేళ ఈ ఆరు జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఈ ఆరు జిల్లాల్లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లలో కనీసం ఒక్కరూ కూడా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయ్యలేదు.

Also read: వాట్సాప్​, ఫేస్‌బుక్, ఇన్​స్టా యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్‌..

అయితే దీనిపై నాగలాండ్ సీఎం నిపియూ రియో శుక్రవారం స్పందిచారు. 'ఈస్టర్న్ నాగ్‌లాండ్ పీపుల్స్‌ సంస్థ'(ENPO) చేస్తున్న డిమాండ్‌తో తమకు ఎలాంటి సమస్య లేదని.. ఎందుకంటే ఇప్పటికే తూర్పున ఉన్న ఆ ఆరు జిల్లాల ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అధికారాలిచ్చేలా ప్రతిపాదనలు చేశామని తెలిపారు. ఇక ఈ ఆరు జిల్లాల్లోని మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 నుంచి 4 వరకు ఎవరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాలేదు. అంతేకాదు పోటీలో నిలబడ్డ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసేందుకు రాలేదు. నాగలాండ్‌లో మొత్తం 13.25 లక్షల మంది ఓటర్లు ఉండగా.. తూర్పున ఉన్న ఈ ఆరు జిల్లాల్లోనే 4,00,632 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఉంది. ఆ ఆరు జిల్లాల్లోనే 20 స్థానాలు ఉండటం గమనార్హం. బంద్‌ పిలుపు మేరకు ఈ ప్రాంత ప్రజలు అటూ అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

అయితే తూర్పున ఈ ఆరు జిల్లాల ప్రాంతంలో సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. అందుకే ఈ ఆరు జిల్లాలు కలిపి తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని కేటాయించాలని 'ఈస్టర్న్ నాగలాండ్ పీపుల్స్‌ సంస్థ'(ENPO) గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అధికారం కల్పించేలా ప్రతిపాదనలు చేసిందని.. దీనివల్ల ఆ ప్రాంతానికి కావాల్సినంత ఆర్థిక సాయం అందుతుందని నాగ్‌లాండ్ సీఎం నిపియూ రియో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై 'ENPO' అధ్యక్షుడు సాపికియూ సాంగ్తమ్ మాట్లాడూతూ.. తమ ప్రాంత ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఎన్నికల సంఘానికి తెలియజేశామని చెప్పారు. ప్రస్తుతం తూర్పు నాగలాండ్ ప్రాంతం పబ్లిక్ ఎమర్జెన్సీలో ఉందని.. ఈ ప్రాంత ప్రజలే స్వచ్ఛందగా ఎన్నికల్లో పాల్గొనకుండా బంద్‌ను పాటించారని తెలిపారు.

Also Read: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

#telugu-news #nagaland #national-news #lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి