Lok Sabha Elections: నాగలాండ్‌లోని ఆ ప్రాంతంలో సున్నా శాతం ఓటింగ్.. కారణం ? ఏప్రిల్ 19న జరిగిన మొదటిదశ ఎన్నికలు జరగగా.. నాగలాండ్‌లోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు హక్కు వినయోగించుకోలేదు. తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా కేటాయించాలనే బంద్ పిలుపు మేరకు ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. By B Aravind 20 Apr 2024 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఏప్రిల్ 19న నిర్వహించిన మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే నాగలాండ్‌లో మాత్రం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని తూర్పున ఉన్న ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇందుకు కారణం తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ రావడమే. 'ఈస్టర్న్ నాగ్‌లాండ్ పీపుల్స్ సంస్థ'(ENPO) ఈ ఆరు జిల్లాలు ఉన్న ప్రాంతాన్ని 'ఫ్రాంటీర్ నాగలాండ్ టెర్రిటరీ(FNT)గా ప్రకటించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న ఎన్నికల వేళ ఈ ఆరు జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఈ ఆరు జిల్లాల్లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లలో కనీసం ఒక్కరూ కూడా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయ్యలేదు. Also read: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్.. అయితే దీనిపై నాగలాండ్ సీఎం నిపియూ రియో శుక్రవారం స్పందిచారు. 'ఈస్టర్న్ నాగ్‌లాండ్ పీపుల్స్ సంస్థ'(ENPO) చేస్తున్న డిమాండ్‌తో తమకు ఎలాంటి సమస్య లేదని.. ఎందుకంటే ఇప్పటికే తూర్పున ఉన్న ఆ ఆరు జిల్లాల ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అధికారాలిచ్చేలా ప్రతిపాదనలు చేశామని తెలిపారు. ఇక ఈ ఆరు జిల్లాల్లోని మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 నుంచి 4 వరకు ఎవరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాలేదు. అంతేకాదు పోటీలో నిలబడ్డ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసేందుకు రాలేదు. నాగలాండ్‌లో మొత్తం 13.25 లక్షల మంది ఓటర్లు ఉండగా.. తూర్పున ఉన్న ఈ ఆరు జిల్లాల్లోనే 4,00,632 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఉంది. ఆ ఆరు జిల్లాల్లోనే 20 స్థానాలు ఉండటం గమనార్హం. బంద్ పిలుపు మేరకు ఈ ప్రాంత ప్రజలు అటూ అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే తూర్పున ఈ ఆరు జిల్లాల ప్రాంతంలో సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. అందుకే ఈ ఆరు జిల్లాలు కలిపి తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని కేటాయించాలని 'ఈస్టర్న్ నాగలాండ్ పీపుల్స్ సంస్థ'(ENPO) గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అధికారం కల్పించేలా ప్రతిపాదనలు చేసిందని.. దీనివల్ల ఆ ప్రాంతానికి కావాల్సినంత ఆర్థిక సాయం అందుతుందని నాగ్‌లాండ్ సీఎం నిపియూ రియో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై 'ENPO' అధ్యక్షుడు సాపికియూ సాంగ్తమ్ మాట్లాడూతూ.. తమ ప్రాంత ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఎన్నికల సంఘానికి తెలియజేశామని చెప్పారు. ప్రస్తుతం తూర్పు నాగలాండ్ ప్రాంతం పబ్లిక్ ఎమర్జెన్సీలో ఉందని.. ఈ ప్రాంత ప్రజలే స్వచ్ఛందగా ఎన్నికల్లో పాల్గొనకుండా బంద్‌ను పాటించారని తెలిపారు. Also Read: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు.. #telugu-news #national-news #lok-sabha-elections #nagaland మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి