/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2-5.jpg)
YS Vijayamma Urges People of Kadapa to vote for YS Sharmila: ఏపీ ముఖ్యమంత్రి, కొడుకు జగన్ కు వైఎస్ విజయమ్మ ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ సంచలన వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డిగారిని ప్రేమించే, అభిమానించే వారంతా షర్మిలను కూడా ఆదరించాలని కోరారు. షర్మిలకు మద్దతుగా నిలిచి, రాజశేఖర్ రెడ్డిలాగే ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. షర్మిలను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు.