YS Sharmila: షర్మిల వస్తే అంటే మోస్ట్ వెల్‌కమ్.. గిడుగు రుద్రరాజు! త్వరలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఎన్నిక కాబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Gidugu Rudra Raju about YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఒక వార్త తెగ ట్రెండ్ అవుతుంది. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila).. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్టు ప్రచారం జోరందుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీ (AP) రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ పై చర్చ జోరందుకుంది. ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల వుండబోతుందనే ప్రచారం జోరందుకుంది. ALSO READ: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ లక్కీ ఛాన్స్ వీరికేనా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తాం అని అన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామక వార్తలపై సమాచారం లేదని పేర్కొన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు.బుధవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ కమిటీ నేతలతో అధిష్ఠానం సమావేశం ఉందని అన్నారు. ఎన్నికలు, పార్టీ బలోపేతం వంటి పలు అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు. ALSO READ: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్! అనంతరం సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్, మైనింగ్ అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. మంత్రులు జిల్లా పర్యటనలు చేసినప్పుడు డబ్బులు లేవు కాబట్టి అవినీతి చేయాల్సి వస్తుందని చెప్పారు. వ్యవస్థ ను సరిదిద్దాడానికి ప్రయత్నం చేయాలనీ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో 100 శాతం అమలు చేస్తామని చెప్పిన జగన్ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. డిజిటల్ మని అని పేరు చెపుతున్న లిక్కర్ షాప్ లో డిజిటల్ పనికి రాదు.. క్యాష్ పెట్టి మాత్రమే కొనాలి అని అంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ని చూసి జగన్ పెట్టిన వైసీపీ ని కాంగ్రెస్ అనుకొన్నారని అన్నారు. అసలు కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..చెప్పి జగన్ ఎన్నికల్లో దిగాలి అని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఏమైంది? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. #ap-news #ap-elections-2024 #ys-sharmila #ap-congress #telangana-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి