YS Sharmila: ఈ మహా యజ్ఙంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఙతలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, పోలీసువారికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు. By Bhavana 14 May 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Ap Politics: ఏపీలో సోమవారం సాయంత్రంతో ఎన్నికల హడావిడి ప్రశాంతంగా ముగిసింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ''గడిచిన కొన్ని వారాలుగా, పగలనకా, రేయనకా, కష్టాల కోర్చి, బాధలను మింగి, సవాళ్లకు ఎదురు నిలిచి, నన్ను నమ్మి, రాజశేఖర బిడ్డగా, మీ గొంతుగా నన్ను ఆదరించి, నా ఈ పోరాటంలో నాతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, శాంతిభద్రతలు సజావుగా సాగేలా చూసిన పోలీసువారికీ , నా అనుచరులూ, అభిమానులూ, ఆప్తులు, స్నేహితులు, నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు,నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను'' అంటూ ఆమె ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. గడిచిన కొన్ని వారాలుగా, పగలనకా, రేయనకా, కష్టాల కోర్చి, బాధలను మింగి, సవాళ్లకు ఎదురు నిలిచి, నన్ను నమ్మి, రాజశేఖర బిడ్డగా, మీ గొంతుగా నన్ను ఆదరించి, నా ఈ పోరాటంలో నాతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు,… — YS Sharmila (@realyssharmila) May 14, 2024 Also read: మళ్లీ గెలిచేది మనమే.. జగన్ సంచలన ట్వీట్! #congress #ap #elections #politics #sharmila #tweet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి