YS Family With Congress:1978లో వైఎస్సార్.. నేడు షర్మిల.. కాంగ్రెస్ తో వైఎస్ ఫ్యామిలీ 40 ఏళ్ళ అనుబంధం!

కాంగ్రెస్‌తో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం 45ఏళ్ళ నాటిది.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా ఇదే పార్టీతో సాగింది.ఆయన తర్వాత పిల్లలు వేరే పార్టీలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల మళ్ళీ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ లెగసీని మళ్ళీ కంటిన్యూ చేసినట్టు అయింది.

YS Family With Congress:1978లో వైఎస్సార్.. నేడు షర్మిల.. కాంగ్రెస్ తో వైఎస్ ఫ్యామిలీ 40 ఏళ్ళ అనుబంధం!
New Update

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekhar Reddy). పీవీ నరసింహారావు తర్వాత కాంగ్రెస్ (Congress) నుంచి అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన వైఎస్ఆర్ చనిపోయేంత వరకు అదే పార్టీతో తన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత కుమారుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరడంతో ఆ లెగసీని కంటిన్యూ చేసినట్టు అయింది. ఇది వైఎస్ కుటుంబానికి...కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిస్తుంది. షర్మిల నిన్న పార్టీలో చేరినప్పుడు కూడా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వల్లనే తన పార్టీని కాంగ్రెస్‌లో కలపడానికి ముందుకొచ్చానని...తన తండ్రా బాటలోనే తాను నడుస్తానని చెప్పుకున్నారు. కాంగ్రెస్‌తో తమ అనుబంధం, ప్రయాణం ఈనాటిది కాదంటూ ఆరోజులను గుర్తుచేసుకున్నారు.

Also read:పెట్రోల్ లో ఇథనాల్ కలపడంతో మన దేశంలో ఎంత డబ్బు మిగిలిందో తెలిస్తే అవాక్కవుతారు

కాంగ్రెస్‌తో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందులలో పుట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వృత్తి రిత్యా డాక్టర్. రాజకీయాల్లోకి రాకముందు వరకు ఆయన డాక్టర్‌గానే ఉన్నారు. 1978లో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన మొదట నుంచి చతన చివరి శ్వాస వరకు కూడా అదే పార్టీతో కొనసాగారు. మొదటిసారి కాంగ్రెస్ తరుఫున పులివెందుల నుంచి పోటీ చేసి శాసన సభలో అడుగుపెట్టారు. మొత్తం ఆరుసార్లు పలివెందుల నుంచి శాసనసభకు, 4సార్లు కడప నుంచి గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వైఎస్ ఓటమి ఎరుగని నాయకుడు. ఆయన పోటీ చేసిన ప్రతీసారి గెలిచారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ తరువాత మూడు సార్లు వరుసగా మంత్రి మండళ్ళల్లో స్థానం సంపాదించారు. కానీ దీని తర్వాత మాత్రం కొంతకాంల ఏ పదవీలోనూ లేరు. అప్పుడే ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేసినా దక్కలేదు.

2003 నుంచి కాంగ్రెస్ లో వైఎస్ శకం..
2003 నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శకం అనే చెప్పుకోవాలి. అప్పుడు ఆయన మొదలుపెట్టిన పాత్ర యాత్ర ఇప్పటికీ ఐకానిక్‌గా నిలుస్తుంది. మండువేసవిలో 1460 కిలోమీటర్లు <1> సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వైఎస్ అంటే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా విపరీతమైన గౌరవం ఉండేది.

వైఎస్ఆర్ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన పిల్లలు..

2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. దీని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. వైఎస్ తర్వాత ఆయన కుమారుడు జగన్ రాజకీయాల్లఓకి వచ్చారు. కానీ ఆయన స్థానాన్ని మాత్రం తీసుకోలేకపోయారు. కాంగ్రెస్‌లో పదవులు దక్కలేదు. దీనికి తోడు జైలుకు కూడా వెళ్ళాల్పి వచ్చింది. ఈలోపు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో జగన్ ఆంధ్రా వచ్చేసి వైసీపీ అనే కొత్త పార్టీ పెట్టుకున్నారు ఆ తర్వాత సీఎం కూడా అయ్యారు. మరోవైపు కూతురు షర్మిల కూడా వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే అది సక్సెస్ కాలేకపోయింది.

షర్మిలకు కాంగ్రెస్ లో కీలక పదవి
రీసెంట్‌గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్టీపీ ఘోరంగా విఫలం అయింది. దీంతో షర్మిల ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వచ్చేస్తున్నారు. ఆంధ్రాలో షర్మిలకు కాంగ్రెస్ నుంచి కీలక పదవి ఇవ్వనున్నారని...ఆంధ్రా కాంగ్రెస్ బాధ్యతలు మొత్తం ఆమె చేతిలో పెట్టనున్నారని చెబుతున్నారు. మొత్తానికి షర్మిల మళ్ళీ కాంగ్రెస్‌లో చేరడంతో తన తండ్రి వారసత్వాన్ని ఆమె కొనసాగించినట్టు అయింది. నిన్న విలీనం సందర్భంగా మాట్లాడినప్పుడు షర్మిల కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తానని చెప్పారు.

#congress #politics #sharmila #ys-rajasekhar-reddy #party #assosiation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe