Cricket: ఆ స్పీడేంట్రా బాబూ..భారత్‌కు మరో శ్రీనాథ్ దొరికేశాడు

Cricket: ఆ స్పీడేంట్రా బాబూ..భారత్‌కు మరో శ్రీనాథ్ దొరికేశాడు
New Update

Mayank Yadav: గంటకు 150కిలోమీటర్ల వేగంతో బంతులు వెయ్యడం చాలా అరుదుగా మారిపోయిన రోజులివి. క్రికెట్ అంతా బ్యాటింగ్‌ మయమే.. ఇక ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల్లో బౌలర్లకు కష్టాలు అన్నీఇన్నీ కావు.. అది కూడా చిన్నస్వామి స్టేడియం లాంటి పిచ్‌లపై బౌలింగ్‌ వెయ్యడం కంటే తార్‌ రోడ్డుపై వెయ్యడం బెటర్‌ అన్న భావన ఉంటుంది. అలాంటి మయాంక్‌ యాదవ్‌ గంటకు 156.7కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. బెంగళూరుపై మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఆ స్పీడేంట్రా బాబూ...

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన రికార్డు షాన్ టైట్ పేరిట ఉంది. టైట్ 2011లో గంటకు 157.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. లాకీ ఫెర్గూసన్ రెండో స్థానంలో ఉన్నాడు. గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఉమ్రాన్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 2022లో 157 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు.

మయాంక్ దెబ్బకు ఢమాల్ అంటున్న బ్యాటర్లు..

మయాంక్ 2022 నుంచి ఐపీఎల్‌లో లక్నో టీమ్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. లక్నో అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా మయాంక్ దేశవాళీ మ్యాచ్‌లో ఆడటం చూశాడు. దీని తర్వాత వేలం సమయంలో మయాంక్‌ను కొనుగోలు చేయాలని సూచించాడు. మయాంక్‌ను లక్నో కొనుగోలు చేసింది. కానీ అప్పుడు గాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసిన మయాంక్‌ తొలి మ్యాచ్‌ నుంచే సంచలనాలు సృష్టించాడు. బ్రెట్ లీ, స్టువర్ట్ బ్రాడ్‌తో సహా చాలా మంది దిగ్గజాలు అతనిని ప్రశంసించారు.

#cricket #mayank-yadav #pacer #ipl-2024 #bowler #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe