Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్నికల హడావుడి ఓ లెవల్లో ఉంది. మామూలుగానే వైసీపీ(YCP), టీడీపీ(TDP) నేతలు, కార్యకర్తలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇది మరింత ఎక్కువైంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. ఇందులో వైసీపీ కౌన్సిలర్ మణికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, మణిని ఆస్పత్రిలో పరామర్శించారు. టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో గెలవలేక తమ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
144 సెక్షన్ అమలు..
ఈ గొడవతో కుప్పంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘర్షణలు చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే భరణ్ పోటీలో ఉన్నారు. చంద్రబాబు(Chandrababu) సొంత నియోజకవర్గం కావడం...ఈసారి పోటీ హోరాహోరీగా ఉండడంతో ఇక్కడ మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికలు జావుగా సాగేందుకు అన్ని చర్యలను చేపట్టారు.
Also Read:Australia: టిక్ టాక్‌తో పాటూ గ్లోబల్ యాప్‌లు, గేమ్‌లతో చైనా నిఘా