YCP Fourth List: నాల్గవ జాబితా మీద వైసీపీ కసరత్తులు...ఇవాళో, రేపో విడుదల ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. By Manogna alamuru 17 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి YCP Fourth List - AP Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాల్గవ లిస్ట్‌ను విడుదల చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీని మీద ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈరోజు లేదా రేపు 4వ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 15 నుండి 20 స్థానాలతో 4వ లిస్టు విడుదల చేయొచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా లిస్ట్ గురించి చర్చించేందుకు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు,ఎంపీలు రానున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కారణంతో.. మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగనున్నాయి. Also Read: క్లీన్ స్వీప్ చేస్తే…టీమ్ ఇండియా ఖాతాలోకి మరో రికార్డ్.. ఈసారి కూడా మార్పులు ఉంటాయి.. మరోవైపు పార్లమెంటు స్థానాలపైనా (MP Seats) వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలకు, 50 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసింది అధిష్టానం. ఇప్పుడు విజయనగరం,అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు పార్లమెంటు స్థానాలను నాలుగవ లిస్టులో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 8 లేదా 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పులను ప్రకటించనుంది వైసీపీ. దీంతో పాటూ విశాఖ,ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా మార్చనున్నారని చెబుతున్నారు. ఇప్పటికి 59 స్థానాల ఇన్ఛార్జ్లు మార్పు.. ఇప్పటి దాకా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు కలిపి 59 స్థానాలకు ఇన్ఛార్జ్లను (YCP Incharges) మార్చింది వైసీపీ. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడవ జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జ్లను మార్చింది. మొత్తం 175 సీట్లుకూడా ఈసారి గెలవాలనే పట్టుదల ఉన్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే పార్టీ బలం కోసం మార్పులు, చేర్పులు చేస్తున్నామని చెబుతున్నారు. అందుకు అందరూ సహకరించాలని ఆయప కోరారు. అందరికీ బవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామని చెబుతున్నారు. 25 నుంచి రాష్ట్ర పర్యటన.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఇందులో రీజనల్ క్యాడర్ సమావేశాలు నిర్వహించునున్నారు. మొదటగా జగన్ (CM Jagan) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరపనుంది వైఎస్సార్సీపీ. ఈ సమావేశాల్లో ఎన్నికల్లో ఏం చేయాలనేది పార్టీ కార్యకర్తలకు, నేతలకు జగన్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. #andhra-pradesh #ycp #ap-elections-2024 #politics #assembly-elections #ap-cm-ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి