One More Shock To YCP : టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బామ్మర్ధి ఆంధ్రాలో వైసీపీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. మల్లాది విష్ణు బాటలోనే ఎంపీ విజయసాయి రెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి కూడా పార్టీ వీడనున్నారని తెలుస్తోంది. ఈయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. By Manogna alamuru 03 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Dwarakanath Reddy : ఎంపీ విజయసాయిరెడ్డి(Vijay Sai Reddy) బావమరిది గడికోట ద్వారకానాథ్ రెడ్డి(Dwarakanath Reddy) వైసీపీ(YCP) కి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. పార్టీని వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. విజయవాడ(Vijayawada) లో చంద్రబాబు(Chandrababu) సమక్షంలో ద్వారకానాథ్ టీడీపీ(TDP) లో చేరనున్నారు. 1994లో లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గం నుంచి శానససభ్యుడిగా ద్వారకనాథరెడ్డి ఎన్నికయ్యారు. 2009 నియోజకవర్గ పునర్విభజనలో రాయిచోటిలో లక్కిరెడ్డిపల్లె కలిసిపోయింది. అప్పటి నుంచి రాయిచోటి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ద్వారకానాథ్. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో కూడా వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అప్పుడు ద్వాకానాథ్‌కు టికెట్ దక్కలేదు. అప్పుడే పార్టీ వీడి వెళ్ళిపోవాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో పార్టీ మారకుండా బావ విజయసాయిరెడ్డి బుజ్జగించడంతో పాటూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో అక్కడే ఉండిపోయారు. Also Read:పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా తగ్గని రద్దీ ఇది జరిగి నాలుగున్నరేళ్ళు అవుతున్నా ద్వారకానాథ్‌కు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎంత ఎదురు చూసిన పార్టీలో గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో గుర్తింపు లేని పార్టీలో ఇమడలేక పార్టీ ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ద్వారకానాథ్ రెడ్డి. నేడు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. #andhra-pradesh #ycp #tdp #dwarakanath-reddy #vijay-sai-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి