YCP Leader Chevireddy Mohith: ఇటీవల ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. పోలింగ్ తర్వాత తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్ళారు. అక్కడ అతని మీద దాడి జరిగింది. ఈ దాడిలో నాని బాగా గాయపడ్డారు కూడా. దీని తర్వాత ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు హత్యాయత్నం సెక్షన్లతో కేసు నమోదు చేశారు. దీంట్లో కుట్రదారు కింద మోహిత్ రెడ్డి పేరును కూడా పోలీసులు చేర్చారు. ఆయన మీద సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
కోర్టులో కేసు వాయిదా పడిన కారణంగా తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రం నుంచి బయటకు వెళుతున్న మోహిత్‌ను బెంగళూరులో తరుపతి పలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడైన మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు. మోహిత్‌ను ఈ రాత్రికి జడ్జ్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.