USA: ట్రంప్ ఆధిక్యానికి బ్రేక్..కమలా ఎఫెక్ట్ అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్‌గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 27 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kamala- Trump: కమలా హారిస్ రాకతో అమెరికా ఎన్నికల్లో పరిణామాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు వరకు ఆధిక్యంలో ఉన్న ట్రంప్ ఇప్పుడు వెనుకబడ్డారని సర్వేలు చెబుతున్నాయి. కమలా హారిస్, ట్రంప్ మధ్య తీవ్ర పోటీ ఉందని అంటున్నాయి. ఆయన ఆధిక్యం తగ్గి.. ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు తాజా పోల్ సర్వేల్లో తేలింది. కమలాకు సొంత పార్టీతో పాటు తెల్లవాళ్ళు కాని ఓటర్ల మద్దతు కూడా భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ జరిపిన సర్వేలో 49, 47 పాయింట్లతో కమలా, ట్రంప్‌ల మధ్య పోటీ ఉంది. అయితే.. తేడా చాలా కొద్దిగా ఉంది ప్రస్తుతానికి. అదే బైడెన్ ఉనప్పుడు అయితే ఈ ట్రంప్ ఆధిక్యంలో ఉండేవారు. అప్పుడు ఇద్దరి మధ్యా తేడా ఎక్కువ ఉండేది. జులై ప్రారంభంలో బైడెన్ మీద ట్రంప్ ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్/సియనా కాలేజీ పోల్ లో కూడా ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. కమలా 47 శాతం.. ట్రంప్ 48 శాతం ఆధిక్యంలో ఉన్నారు. జులై ప్రారంభంతో పోలిస్తే డెమోక్రాట్‌లకు ఆదరణ పెరిగింది. రిజిస్టర్డ్ ఓటర్ల విషయంలో ట్రంప్ ముందంజలో కొనసాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్‌నకు 48 శాతం, కమలాకు 46 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలిపాయి. అంతకుముందు బైడెన్‌పై ఆయన తొమ్మిది పాయింట్ల ఆధిక్యం కనబర్చారు. నెల క్రితం న్యూయార్క్ టైమ్స్ పోల్‌లో నల్లజాతి ఓటర్ల నుంచి బైడెన్‌కు 59 శాతం మంది మద్దతు ఉంటే ఇప్పుడు కమలా వచ్చాక అద మరింత పెరిగింది.ప్రస్తుతం ఇది 69 శాతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. లాటిన్ ఓటర్లనుంచి డెమోక్రటిక్ పార్టీకి ఆదరణ 45 శాతం నుంచి 57 శాతానికి పెరగడం విశేషం. #elections #kamala-harries #survey #donald-trump #usa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి