Telangana : యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టే.. మళ్ళీ పేరు మార్పు

యాదాద్రి పేరు మళ్ళీ మారనుంది. యాదాద్రిని మళ్ళీ తిరిగి యాదగిరి గుట్టగానే మారుస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.

Telangana : యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టే.. మళ్ళీ పేరు మార్పు
New Update

Yadadri Laxmi Narasimha Swamy Temple : ప్రభుత్వం మారినప్పుడల్లా పేరు మారుతోంది. తెలంగాణ(Telangana) లో ఫేమస్ పుణ్యక్షేత్రమైన యాదాద్రి(Yadadri) కి మళ్ళీ పేరు మారుతోంది. లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) క్షేత్రమైన ఈ కొండను ఇంతకు ముందు యాదగిరి గుట్ట(Yadagiri Gutta) అని పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేశారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీమోడల్ చేశారు. అప్పుడే దీని పేరును యాదాద్రి అని కూడా మార్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్ళీ ఈ క్షేత్రానికి ఉన్న పేరును మారుస్తున్నారు. తిరిగి పాత పేరునే తీసుకురాబోతున్నామని చెబుతున్నారు.

పాత పేరుతోనే మళ్ళీ...

యాదాద్రిలో నరసింహస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేరు విషయాన్ని ప్రకటించారు. యదాద్రి సేరును యాదగిరి గుట్టగా మారుస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ క్షేత్రాన్ని మరింత డెవలప్‌ చేయనున్నామని కూడా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నరసింహ స్వామి ఆలయంలో మరిన్ని సౌకర్యాలకు రూపకల్పన చేయాలని భావిస్తున్నారని తెలిపారు. కొండ మీద డార్మిటరీ హాల్ నిర్మించి... భక్తులు నిద్ర చేసే అవకాశాన్ని కూడా కల్పించాలని అనకుకుంటాన్నారని చెప్పారు. అంతేకాదు పూజారుల కోసం మరుగుదొడ్లు, విశ్రాంతి గదులన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

పేరు మార్చమని చెప్పిన చినజీయర్..

యాదాద్రి పేరును త్రిదండి చినజీయర్ స్వామి సూచించారన్న ప్రచారం కూడా జరిగింది. చాలా కాలంగా యాదాద్రి అనే ప్రస్తావిస్తున్నారు. కొంత కాలంగా యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ పేరు మార్పు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. నెలరోజుల్లో దీని మీద సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.

Also Read : Movies : ఉపాసన కాళ్ళు పడుతున్న రామ్‌ చరణ్..క్యూట్ వీడియో

#telanagna #yadadri #brs #name-changing #congress #yadagiri-gutta
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి