కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ..

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం అయినటువంటి మునుగోడులో నిరసన సెగ తగిలింది. పార్టీ కుమ్ములాటలో భాగంగా.. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీ గూటిలో చేరాడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కాస్త.. ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ..
New Update

yadadri-bhonagiri-district-munugodu-komati-reddy-wall-poster-viral

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలవ్యాప్తంగా వెలిసిన వాల్‌ పోస్టర్లు సంచలనంగా మారాయి. మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు.. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల న‌మ్మ‌కాన్ని అమ్ముకున్న ద్రోహివి.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ‌ను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్‌షా తో.. బేర‌మాడిన నీచుడివి అంటూ పోస్ట‌ర్ల‌లో గుర్తుతెలియని వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్లు న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతేకాకుండా లోకల్ ప్రజలే ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం మునుగోడు నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని క్షమించరు అనే శీర్షికతో వందలాది పోస్టర్‌లను సంస్థాన్ నారాయణపూర్ మెయిన్ సెంటర్‌లో గోడలకు అతికించారు. 20 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం రాజ్‌గోపాల్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని పోస్టర్‌లో ఆరోపించారు. అయితే ఆ పోస్టర్లలో ఎవరనేది మాత్రం పేరు మెన్షన్‌ చేయలేదు. వాల్ పోస్టర్ యొక్క బాటమ్ లైన్లో మాత్రం ప్రజా,ప్రయోజనాల కోసం అంటూ జారీ చేశారు.

పోస్టర్లపై రాజ్‌గోపాల్‌రెడ్డి ఇలా స్పందిస్తూ..

yadadri-bhonagiri-district-munugodu-komati-reddy-wall-poster-viral

ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డి పోస్టర్లపై స్పందిస్తూ.. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అతని పాత్ర గురించి మునుగోడు ప్రజలకు బాగా తెలుసు. తన వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చానని, అయితే తన రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించలేదని అన్నారు. వాల్ పోస్టర్లలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నేతలు ఆయనపై బురద జల్లుతున్నారని తెలిపారు.

మునుగోడుపై బీజేపీ జెండా అంటూ రాజగోపాల్‌ రెడ్డి ధీమా..

yadadri-bhonagiri-district-munugodu-komati-reddy-wall-poster-viral

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడిందని, అయితే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై చేసిన ఆరోపణలకు రుజువులుంటే 24 గంటల్లో నిరూపించాలని హితవు పలికారు. ఉపఎన్నికల్లో మునుగోడుపై బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యమే గెలుస్తుందన్నారు. ఆగస్టు 21న మునుగోడులో హోంమంత్రి అమిత్ షా పాల్గొనే బీజేపీ బహిరంగసభ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు. బహిరంగ సభకు మూడు లక్షల మందిని సమీకరించనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

#politics #bjp #komatireddy-rajagopal-reddy #nalgonda #banners #munugodu #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి