Munugodu: మునుగోడు కాంగ్రెస్లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో చలమల కృష్ణారెడ్డి అలిగారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల కృష్ణారెడ్డి.. ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రకటనతో చలమల గుస్సా అవుతున్నారు. నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్ ను వదిలిపెట్టేదే లేదంటున్నారు.