World Bicycle Day : వరల్డ్ సైకిల్ డే.. సైక్లింగ్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 3న జరుపుకుంటారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రతిరోజు సైకిల్ తొక్కడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. By Archana 03 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Cycling : 'వరల్డ్ సైకిల్ డే 2024' (World Cycle Day) ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశం. ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకోవడం మొదటగా జూన్ 3 2018న ప్రకటించబడింది. రోజూ అరగంట సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగానే కాకుండా మానసిక వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. అంతేకాదు రోజూ సైకిల్ తొక్కడం ద్వారా మనిషి ఊబకాయం (Obesity), గుండె జబ్బులు (Heart Diseases), మధుమేహం (Diabetes) వంటి వ్యాధులను దూరంగా ఉంచవచ్చు. అయితే కాలక్రమేణా సైక్లింగ్‌కు ప్రజల్లో ప్రాధాన్యత తగ్గుతోంది. కొత్త కొత్త కార్లు, బైక్స్ వచ్చాక.. అందరు సైకిల్స్ పక్కన పెట్టేసారు. కానీ రోజు ఒక అరగంట సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో లాభం చేకూరుతుంది. నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తొక్కడం వెనుక ప్రాముఖ్యతను తెలుసుకుందాము సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గుండె ఫిట్‌గా ఉంటుంది కండరాల బలం, పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి ఎముకలు దృఢంగా మారుతాయి శరీరంలో కొవ్వు తగ్గుతుంది ఆందోళన, డిప్రెషన్ సమస్య తగ్గుతుంది సైక్లింగ్ చేస్తున్నప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా చెమట పట్టి, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా శరీరంలో కొవ్వు కరగడం, ఫిట్ గా ఉండడానికి సహాయపడుతుంది. సైక్లింగ్ ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి కూడా చాలా సురక్షితం. ప్రతీ చిన్న పనికి కూడా కారు, బైక్స్ వాడడం ద్వారా పర్యావరణంలో కాలుష్యం ఎక్కువైపోతోంది. చిన్న చిన్న వాటి కోసం బయటకు వెళ్ళేటప్పుడు సైకిల్స్ వాడడం ఉత్తమం. సైక్లింగ్ శరీర ఆకృతిని మెరుగుపరుస్తుందా? క్రమం తప్పకుండా సైకిల్ తొక్కినట్లయితే, శరీరం మంచి ఆకృతిని పొందుతుంది. ఇది క్యాలరీలను బర్న్ చేసే గుండె వ్యాయామం. సైకిల్ తొక్కడం వల్ల కడుపు చుట్టూ ఉండే మొండి కొవ్వు కూడా కరిగిపోతుంది. మంచి ఫలితాల కోసం, సైక్లింగ్‌తో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని ఏ భాగాలు టోన్ అవుతాయి? దిగువ శరీరాన్ని, ముఖ్యంగా కాళ్లను టోన్ చేయడానికి సైక్లింగ్ గొప్పగా పరిగణించబడుతుంది. హామ్ స్ట్రింగ్స్, క్వాడ్రిస్ప్స్ సైక్లింగ్ సమయంలో ఎక్కువగా టార్గెట్ చేయబడిన కండరాలలో ఒకటి. Mango Delight: ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో డిలైట్.. ! - Rtvlive.com #health-benefits #obesity #diabetes #heart-diseases #world-bicycle-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి