డీ లిమిటేషన్ తర్వాతనే మహిళకు రిజర్వేషన్లు దక్కేది

నూతన పార్లమెంటు భవనంలో జరిగిన మొదటి లోక్ సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దానికి సంబంధించిన వివరాలు...

New Update
డీ లిమిటేషన్ తర్వాతనే మహిళకు రిజర్వేషన్లు దక్కేది

మొత్తానికి మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించనున్నారు. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు కూడా మద్దుతు పలుకుతున్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ భారతదేశంలో పార్లమెంటు,శాసనసభల్లో 14 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది...కరెక్టే కానీ ఇది పూర్తిగా అమల్లోకి రావాలంటే మాత్రం 2027 లేదా 2029 వరకూ ఆగాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే పేర్కొన్నారు.

మమఙళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్ సభ, శాసనసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించాలి. ఢిల్లీ అసెంబ్లీతో సభా అన్ని రాష్ట్రాలకూ ఇది వర్తిస్తుంది. చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యం పెంచడం కోసమే దీనిని తీసుకువచ్చారు. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత, నియోజకవర్గాల పునర్నిర్మాణం తర్వాత మాత్రమే కోటా అమలు చేయడానికి అవుతుంది.

జనాభా లెక్కల ప్రకారం 2027లో నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ జరుగుతుంది. దాని తర్వాత మహిళా కోటా అమల్లోకి వస్తుంది. 2027లో జనాభా లెక్కలు నిర్వహిస్తే...పునర్వస్థీకరణ జరగడానికి మరో రెండు ఏళ్ళు పట్టవచ్చని అంచనా. అలా అయితే మహిళా బిల్లు పూర్తిగా అమల్లోకి వచ్చేది 2029లోనే. రూల్ ప్రకారం 2021లో జనాభా లెక్కలను నిర్వహించాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. చట్ట సభల్లో 15 ఏళ్ళపాటూ మహిళలకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. దీని తర్వాత కాల వ్యవధిని పొడిగించే అవకాశం ఉంది. మహిళా బిల్లులో షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్ ఉంది. ఓబీసీలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. రాజ్యసభ, రాష్ట్రమండలిలో కూడా ఋ రిజర్వేషన్ వర్తించదు.

మహిళా బిల్లులో కీలక అంశాలు...

  • పార్లమెంటు, శాసన సభల్లో 33 శాతం సీట్లుఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు
  • ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేదు
  • ఒక స్థానంనుంచి ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ చేసే అనుమతి లేదు.
  • డీ లిమిటేషన్ తర్వాతనే బిల్లు అమల్లోకి. 15 ఏళ్ళపాటూ కొనసాగుతుంది.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు